- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Free Bus Scheme: కడప మహిళల కళ్లల్లో ఆనందం
by Vemula.Srinu Prasad |
ఏపీలో ఫ్రీ బస్సు పథకంపై ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో ఫ్రీ బస్సు(Free Bus) పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసింది. దీంతో మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. బస్సులో ఆధార్‌తో పాటు ఓటర్ కార్డు, ఇతర ప్రభుత్వ కార్డు చూపించి ప్రయాణం కొనసాగిస్తున్నారు. అయితే పథకం అమలు ఇప్పుడిప్పుడే కావడంతో పలువురు మహిళలు గందరగోళానికి గురవుతున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించేటప్పుడు ఎలాంటి కార్డులు చూపించకపోవడంతో డ్రైవర్లు వారికి టికెట్స్ ఇస్తున్నారు. పథకం అమలు విషయం తెలియక ఇలా జరిగిందని పలువురు మహిళలు తెలిపారు. ఉచిత బస్సు పథకం మంచిదేనని, పండగల వల్ల రద్దీ తక్కువగా ఉందని, సోమవారం నుంచి ఉద్యోగులు కూడా ప్రయాణిస్తారని, అప్పుడు ఎలా ఉంటుందో చూడాలని అన్నారు. ప్రస్తుతానికి ప్రయాణం కంఫర్ట్‌గానే ఉందని హర్షం వ్యక్తం చేశారు.
Next Story






