VSR రాజీనామా పై ఎట్టకేలకు స్పందించిన మాజీ మంత్రి

by Jakkula.Mamatha |

వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి( Vijayasai reddy ) రాజీనామాపై పార్టీకి చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ (Former Minister Gudivada Amarnath ) స్పందించారు.

VSR రాజీనామా పై ఎట్టకేలకు స్పందించిన మాజీ మంత్రి
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి( Vijayasai reddy ) రాజీనామాపై పార్టీకి చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ (Former Minister Gudivada Amarnath ) స్పందించారు. నేడు(ఆదివారం) గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖ(Vishakapatnam0లోని పార్టీ(YCP) కార్యాలయంలో జెండాను ఆవిష్కరించిన అనంతరం మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారే వాళ్ళను సముదాయిస్తాం కానీ.. కాళ్లు పట్టుకోలేమని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని స్వయంగా విజయసాయి చెప్పారని ఆయన తెలిపారు.

మాజీ సీఎం జగన్‌(Former CM Jagan)కు నాయకులను ఏ విధంగా తయారు చేయాలో తెలుసన్నారు. నాయకుల మీద రాజకీయంగా ఒత్తిడి ఉండడం సహజమే.. దాన్ని కొంతమంది తట్టుకుంటారు. మరి కొంతమంది తట్టుకొని నిలబడలేరని పేర్కొన్నారు. వైఎస్ జగన్ విదేశాల నుంచి వచ్చిన తర్వాత తాజా పరిణామాలపై చర్చిస్తామన్నారు. గతంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) మీద నమ్మకం లేక టీడీపీ(TDP) రాజ్యసభ సభ్యులు పార్టీలే మారారని దుయ్యబట్టారు. ఒక మనిషి లేకపోయినా రాజకీయం ఆగిపోదన్నారు. దావోస్ నుంచి ఉత్త చేతులతో తిరిగి వచ్చారని ఆయన పేర్కొన్నారు.

Next Story