- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏలూరు జిల్లాలోకి పెద్దపులి ఎంట్రీ... బిగ్ అలర్ట్...!
పులి కదలికల నేపథ్యంలో అటవీ శాఖ యంత్రాంగం హై అలర్ట్ జారీ చేసింది....

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari District) సరిహద్దుల్లో కొన్ని రోజులుగా పెద్దపులి(Tiger) కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తన మకాంను ఏలూరు జిల్లాకు మార్చింది. నిన్నటి వరకు పోలవరం(Polavaram) ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలను భయాందోళనకు గురిచేసింది. శనివారం తెల్లవారుజామున గోదావరి నది(Godavari River)ని దాటి ఏలూరు జిల్లా(Eluru District) పోలవరం మండలంలోకి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు(Forest Department officials) ప్రకటించారు. పులి మెడకున్న రేడియో కాలర్ సిగ్నల్స్ ఆధారంగా ప్రస్తుతం అది కొత్తూరు, సింగనపల్లి గ్రామాల మధ్య సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పులి కదలికల నేపథ్యంలో....
పులి కదలికల నేపథ్యంలో అటవీ శాఖ యంత్రాంగం హై అలర్ట్ జారీ చేసింది. ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతంలో చేపల వేట కోసం మత్స్యకారులు నదిలోకి వెళ్లవద్దని సూచించారు. పాపికొండల అభయారణ్యం సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు ఒంటరిగా బయటకు రావద్దన్నారు. పశువుల కాపరులు అడవి ప్రాంతానికి వెళ్లవద్దని సూచించారు. పులి ఎటువైపు వెళ్తుందో అంచనా వేస్తూ స్థానిక ప్రజలను అప్రమత్తం చేసేందుకు మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పులి పాదముద్రలను సేకరించామని, జనావాసాల్లోకి రాకుండా అడవి వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని స్పష్టం చేశారు.






