- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుష్కరఘాట్‌లో వరద ఉధృతి.. ఇద్దరు భవానీ భక్తులు గల్లంతు
by Vemula.Srinu Prasad |
రాజమండ్రి వద్ద గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. ..

X
దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రి(Rajahmundry) వద్ద గోదావరి(Godavari)కి వరద ఉధృతి(Flood surge) కొనసాగుతోంది. అయితే ఈ ఉధృతిలో ఇద్దరు భవానీ భక్తులు గల్లంతయ్యారు. ఎస్డీఆర్ఎస్ బృందాలు గాలిస్తున్నాయి. భక్తులిద్దరూ రాజమండ్రికి చెందిన వారిగా గుర్తించారు. వరద ప్రవాహం ఉండటంతో పుష్కర ఘాట్ వద్ద ప్రవాహం ఉధృతిగా ఉంది. దీంతో అక్కడికి ఎవరిని అనుమతించడంలేదు. ఇద్దరు గల్లంతు కావడంతో పోలీసుల గస్తీ నిర్వహించారు. పుష్కర ఘాట్ల మొత్తం బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ నాలుగు ఉప నదులు పొంగిపొర్లడంతో కాజ్‌లపై గోదావరి నీరు ప్రవాహిస్తోంది. దీంతో పలు చోట్ల కాజ్ వేలు పూర్తిగా మునిగిపోయాయి. ఈ మేరకు పడవల సాయంతో 27 లంక గ్రామాల ప్రజలందరూ పునరావాసాలకు వెళ్తున్నారు.
Next Story






