- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: అటు శుభాకాంక్షలు..ఇటు విమర్శలు..ఆసక్తికరంగా జనసేన ఫ్లెక్సీలు
రేపటి నుండి సంక్రాంతి పండుగ మొదలవుతుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.

దిశ వెబ్ డెస్క్: రేపటి నుండి సంక్రాంతి పండుగ మొదలవుతుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ నేపధ్యంలో బ్రతుకు దెరువుకు పట్టణానికి వచ్చిన పల్లె వాసులంతా స్వస్థలానికి తిరుగు ప్రయాణం అయ్యారు. దీనితో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే రహదారిపై రద్దీ అమాంతం పెరిగి రహదారి వాహనాలతో కిటకిటలాడుతోంది.
ఇది ఇలా ఉంటె రహదారులకు ఇరువైపులా జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లు ప్రజల్లో ఆసక్తిని రెక్కేతిస్తున్నాయి. ఓ వైపు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలను తెలుపుతూనే మరో వైపు వైసీపీ పై విమర్శల జల్లును కురిపిస్తున్నాయి ఆ ఫ్లెక్సీలు, కటౌట్లు. నందిగామ వద్ద జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఏపీలో రోడ్లు సరిగా లేవు జాగ్రత్త అని, పండగ జోష్ లో వాహనాల జోరు పెంచితే ఏపీ రోడ్లు బ్రేక్ వేస్తాయని.. జాగ్రత్తగా ఇంటికి చేరండంటూ ఆ ఫ్లెక్సీల్లో సూచనలు చేశారు. కాగా ఆ ఫ్లెక్సీల ద్వారా ఆంధ్రప్రదేశ్ రోడ్లు అద్వానంగా ఉన్నాయని వివరిస్తూ జగన్ ప్రభుత్వం పైన విమర్శల జల్లు కురిపించింది జనసేన పార్టీ.






