- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుపరిపాలనలో ‘తొలి అడుగు’.. ప్రజా సేవకు అనూహ్య స్పందన
పండగ వాతావరణంలో ప్రారంభమైన ఇంటింటికీ ‘సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం జరిగింది....

దిశ, వెబ్ డెస్క్: పండగ వాతావరణంలో ప్రారంభమైన ఇంటింటికీ ‘సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Government) తమ పాలనను ప్రజలకు ప్రత్యక్షంగా వివరించే దిశగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో అమలైన సంక్షేమ–అభివృద్ధి(Welfare-Development) కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. 'సూపర్ 6' హామీల అమలు, కీలక పథకాలు, ప్రాజెక్టుల పురోగతి, చేసిన అభివృద్ధి తదితర అంశాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. అంతేకాదు వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. గత ఏడాది చేసిన పనులను ప్రజల ముందుంచటంతో పాటు చేయబోతున మంచిపై అవగాహన కల్పిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రజలు సైతం స్పందిస్తున్నారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల అమలులో వివక్షతను ఎదుర్కొన్నామని ప్రజాప్రతినిధులకు చెబుతున్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో అందరికీ సమానంగా 'సూపర్ 6' పథకాలు అందుతున్నాయని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.






