- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాకాణికి ముగిసిన తొలి రోజు కస్టడీ.. ఎన్ని ప్రశ్నలు అడిగారంటే..?
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి తొలి రోజు కస్టడీ ముగిసింది...

దిశ, వెబ్ డెస్క్: మద్యం అక్రమ నిల్వల(Liquor Illegal Stock) వ్యవహారంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy)పై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయనను ఎక్సైజ్ అధికారులు(Excise Officers) కస్టడీకి తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు ప్రశ్నలు సందించారు. అధికారులు మొత్తం 37 ప్రశ్నలు అడిగారు. ఎన్నికల వేళ లిక్కర్ సరఫరాపై విచారణ జరిపారు. విచారణ అనంతరం కాకాణిని నెల్లూరు జిల్లా జైలు(Nellore Jail)కు తరలించారు.
కాగా నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారం(Illegal Mining)లో ఆయన అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. అంతేకాదు మరికొన్ని కేసుల్లోనూ కాకాణి నిందితుడిగా ఉన్నారు. ఈ క్రమంలోనే మద్యం అక్రమ నిల్వల వ్యవహారంలోనూ ఆయనపై కేసు నమోదు అయింది. దీంతో రెండు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల అభ్యర్థనకు కోర్టు అనుమతించింది. రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆయన్ను శనివారం కస్టడీకి తీసుకుని విచారించారు. ఆదివారం కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది.






