- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pawan kalyan: అగ్ని ప్రమాద ఘటన ఆవేదన కలిగించింది.. పవన్ కళ్యాణ్
by Thanuru Gopichand |
హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జార్ హౌస్ప్రాం తంలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జార్ హౌస్ (Charminar Fire accident) ప్రాంతంలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ దుర్ఘటనలో పదుల సంఖ్యలో దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదన చెందానన్నారు. బాధిత కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. క్షతగాత్రులకి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నాను.. అని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు
Next Story






