Ap: శుక్రవారం ఏపీ వార్షిక బడ్జె‌ట్‌.. సర్వం సిద్ధం చేసిన ఆర్థిక శాఖ

by srinivas |   ( Updated:2025-02-28 01:56:14.0  )
Ap: శుక్రవారం ఏపీ వార్షిక బడ్జె‌ట్‌.. సర్వం సిద్ధం చేసిన ఆర్థిక శాఖ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ(AP Assembly)లో వార్షిక బడ్జెట్(Annual budget) ప్రవేశ పెట్టేందుకు ఆర్థిక శాఖ(Finance Department) సర్వం సిద్ధం చేసింది. 2025-26కు సంబంధించి రూ. 3.20 లక్షల కోట్లు అంచనాలతో శుక్రవారం బడ్జెట్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(Finance Minister Payyavula Keshav) బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సూపర్ సిక్స్ పథకాల(Super Six Schemes)తో పాటు పలు అభివృద్ధి పనులకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడమే లక్ష్యంగా బడ్జెట్‌ను రెడీ చేశారు. అంతేకాదు రాష్ట్ర మూల ధన వ్యయం పెంచేలా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు సమాచారం.

అయితే శుక్రవారం ఉదయం సీఎం చంద్రబాబు(Cm Chandrababu) అధ్యక్షతన ఉదయం 9 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదముద్ర పడనుంది. అనంతరం అసెంబ్లీలో మంత్రి పయ్యవుల కేశవ్, శాసనమండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. అలాగే వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు.



Next Story

Most Viewed