- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనారోగ్యంతో 8 ఏళ్ల కూతురు.. రోడ్డు సౌకర్యం లేక 4 కి.మీ మోసుకెళ్లిన తండ్రి
గ్రామానికి రోడ్డు, అంబులెన్స్ సౌకర్యం లేక తన కూతురుని తండ్రి 4 కిలో మీటర్ల మేర మోసుకెళ్లారు...

దిశ, వెబ్ డెస్క్: ప్రభుతాలు మారుతున్నా పల్లె జనాల కష్టాలు మాత్రం మారడం లేదు. 40, 30 ఏళ్ల క్రితం అనుభవించిన ఇబ్బందులు ఇంకా పడుతూనే ఉన్నారు. కొన్ని గ్రామాల్లో రోడ్లు, ఆస్పత్రులు, వాహన సౌకర్యం లేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నా.. నవ మాసాలు నిండినా డోలీనే దిక్కు అవుతుంది. అందుకు కూడా కొన్ని సమయాల్లో రెండో వ్యక్తి లేక పోతే మనిషి భుజమే అంబులెన్స్ అయి ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి ఉంది.
తాజాగా ఏపీ(Ap)లో జరిగిన ఈ హృదయ విదారక ఘటన చూస్తే ఎవరైనా సరే చలించిపోవాల్సిందే. అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Seetharamaraju District) చింతపల్లి ఏజెన్సీ(Chintapalli Agency)లో రెండు రోజులుగా జోరుగా వర్షాలు పడుతున్నాయి. మరోవైపు తన కూతురు అనారోగ్యంతో బాధపడుతున్నారు. జ్వరం(Fever)తో వణికిపోతున్న కూతురుని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు తండ్రి ప్రయత్నం చేశారు. తాడిబంద గ్రామానికి రోడ్డు సౌకర్యం సరిగాలేదు. దగ్గరలో ఆస్పత్రి లేదు. అంబులెన్స్ సైతం రాని పరిస్థితి నెలకొంది. దీంతో తండ్రే సాహనం చేశారు. జర్వంతో బాధపడుతున్న తన 8 ఏళ్ల కూతురుని ఎత్తుకుని ఆస్పత్రికి బయల్దేరారు. వర్షం పడుతున్నా లెక్క చేయలేదు. గొడుగు సాయంతో దారిబాట పట్టారు. తాడిబంద నుంచి బచ్చంత వరకూ దాదాపు 4 కిలోమీటర్ల మేర తన కూతురుని ఎత్తుకుని జోరు వానలోనే నడిచారు. బచ్చంత నుంచి ఆటోలో డౌనూరు పీహెచ్‌సీ తరలించారు. అయితే తన కూతురు పరిస్థితి విషమించడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ తండ్రి కష్టం ఎవరికీ రాకూదండూ నెటిజన్లు అంటున్నారు. తండ్రి కష్టం వృదాగా పోకూదని, తన కూతురు ఆరోగ్యంగా ఇంటికి చేరాలని దేవుడ్ని కోరుకుంటున్నారు.






