రాజీనామా ఆమోదించాలి.. లేకపోతే మళ్లీ హైకోర్టుకు వెళ్తా: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-30 11:08:42  IST  )

ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా ఆమోదించకపోవడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

రాజీనామా ఆమోదించాలి.. లేకపోతే మళ్లీ హైకోర్టుకు వెళ్తా: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ(MLC Jayamangala Venkataramana) రాజీనామాను మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆమోదించకపోవడంపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 2014-19లో ఆయన టీడీపీ(Tdp)లో, 2019-24లో వైసీపీ(ycp)లో పని చేశారు. అప్పటి జగన్(Jagan) ప్రభుత్వం జయమంగళవెంకట రమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. జగన్ హయాంలో వరకు వైసీపీలోనే కొనసాగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ప్రస్తుతం పార్టీలోనే ఆయన కొనసాగుతున్నారు.

అయితే తన రాజీనామాను మండలి చైర్మన్ మోషేన్ రాజు(Council Chairman Moshen Raju) ఆమోదించడంలేదని ఆయన అంటున్నారు. ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించారు. తన రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదించాలని కోరారు. దీంతో రాజీనామా వ్యవహారంపై చర్చించేందుకు జయమంగళవెంకటరమణను మండలికి రావాలని మోషేన్ రాజు పిలుపు నిచ్చారు. దీంతో సోమవారం మండలి చైర్మన్ ను కలిసేందుకు జయమంగళవెంకటరమణ రెడీ అయ్యారు. సోమవారం ఉదయం మండలికి వెళ్తానని తెలిపారు. కానీ తన రాజీనామాను మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆమోదించాలని జయమంగళవెంకటరమణ డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరోసారి కూడా హైకోర్టుకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపారు. కూటమిలో ఉన్నాను కాబట్టి వైసీపీ నుంచి పదవి తనకు వద్దని ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ తెలిపారు.

Next Story