మందుబాబులను బురిడీ కొట్టించిన వైన్స్.. ఇద్దరు అరెస్ట్, రిమాండ్

by Vemula.Srinu Prasad |

మందుబాబులను బురిడీ కొట్టించిన వైన్ షాపు సిబ్బందిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు....

మందుబాబులను బురిడీ కొట్టించిన వైన్స్.. ఇద్దరు అరెస్ట్, రిమాండ్
X

దిశ, వెడ్ డెస్క్: మందుబాబులను బురిడీ కొట్టించిన వైన్ షాపు సిబ్బందిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలిలో పీఆర్ వైన్స్ సిబ్బంది కొంతకాలంగా మందుబాబులను మోసం చేస్తున్నారు. నీళ్లు కలిపిన మద్యాన్ని అమ్ముతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎక్సైజ్ పోలీసులు.. వైన్స్ షాపుపై దాడి చేశారు. దీంతో అసలు విషయం బయట పడింది. నీళ్లు కలిపిన మద్యాన్ని గుర్తించి సీజ్ చేశారు. షాపులో పని చేసే ఇద్దరు సిబ్బందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పీఆర్ వైన్స్ యాజమానులపై కేసు నమోదు చేశారు.

Next Story