- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరుడుగట్టిన రిమాండ్ ఖైదీ.. పోలీసుల కళ్లు కప్పి పరారీ
గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంతర్రాష్ట్ర నేరస్థుడు భీముడు అజిత్ కుమార్ పోలీసుల కళ్లు గప్పి పరారవ్వడం సంచలనంగా మారింది. ..

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)లో చికిత్స పొందుతున్న అంతర్రాష్ట్ర నేరస్థుడు భీముడు(ఇంటర్ state Criminal Bheemudu) అజిత్ కుమార్ పోలీసుల కళ్లు గప్పి పరారవ్వడం సంచలనంగా మారింది. నాలుగు రాష్ట్రాల్లో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అజిత్ కుమార్‌ను తెనాలి పోలీసులు అరెస్ట్ చేసి రేపల్లె సబ్‌జైలు(Repalle Sub-jail)కు తరలించారు. అయితే అనారోగ్యం కారణంగా చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. శనివారం ఆసుపత్రిలోని ఏసీ కాలేజీ గేటు ద్వారా అజిత్ కుమార్ తప్పించుకున్నట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనపై సీరియస్ అయిని ఎస్పీ వకుల్ జిందాల్(SP Vakul Jindal) విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఏఆర్ పోలీసులను సస్పెండ్ చేశారు. నేరస్థుడి పట్ల కట్టుదిట్టమైన భద్రత కల్పించడంలో విఫలమైనందువల్లే ఈ పరారీ జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం తప్పించుకున్న ఖైదీ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.






