ప్రభుత్వ ఖజానాకు రూ. 4 వేల కోట్లు గండి.. లిక్కర్ కేసులో ఈడీ కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

లిక్కర్ కేసు దర్యాప్తులో ఖజానాకు రూ. 4 వేల కోట్లు గండిపడినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది...

ప్రభుత్వ ఖజానాకు రూ. 4 వేల కోట్లు గండి.. లిక్కర్ కేసులో ఈడీ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కేసు(Liquor Case) దర్యాప్తులో ఖజానాకు రూ. 4 వేల కోట్లు గండిపడినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) గుర్తించింది. కిక్ బ్యాగుల రూపంలో వేల కోట్ల రూపాయలు మనీలాండరింగ్ జరిగినట్లు తెలిపింది. తొలుత సీఐడీ(CID) నమోదు చేసిందని, దీని ద్వారా దర్యాప్తు చేసినట్లు పేర్కొంది. శనివారం జరిగిన సోదాల్లో రూ. 38 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ఏకకాలంలో ఏపీ(Ap), తెలంగాణ(Telangana)తో పాటు చెన్నై, తంజావూరు సహా పలు చోట్ల తనిఖీలు చేపట్టినట్లు చెప్పింది. అంతేకాకుండా పలు కీలక పత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది.

Next Story