Ap News: కొండపి పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవం

by Vemula.Srinu Prasad |

ప్రకాశం జిల్లా కొండపి పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవం అయింది..

Ap News: కొండపి పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా(Prakasam District) కొండపి పంచాయతీ ఎన్నికల్లో(Kondapi Panchayat elections) నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ పంచాయతీలో ఉన్న 14 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని అంతాభావించారు. అయితే అనూహ్యంగా అన్ని వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో 9 వార్డుల్లో టీడీపీ, 5 వార్డుల్లో వైసీపీ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయా పార్టీలు హర్షం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా కొండపి పంచాయతీలో అసలు ఎన్నికలు జరిగే పరిస్థితే లేదని, పోటీ చేసిన అభ్యర్థులపై దాడులు జరిగాయని, బెదిరించి అప్పటి అధికార పార్టీ ఏకగ్రీవం చేసుకుందని టీడీపీ నేతలు తెలిపారు. కానీ తమ ప్రభుత్వంలో ఎలాంటి దాడులు లేవని, స్వేచ్ఛగా పార్టీలు నిర్ణయం తీసుకున్నాయని పేర్కొన్నారు.

Next Story