జెడ్పీలకు తీపి కబురు.. రెండు రోజుల్లో కొత్త సీఈవోల నియామకం

by Vemula.Srinu Prasad |

ఏపీలో జిల్లాల విభజన ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. కేబినెట్ సమావేశం తరువాత కొత్త జిల్లాల ప్రాతిపదికన సీఈవోలను ప్రభుత్వం నియమించనుంది...

జెడ్పీలకు తీపి కబురు.. రెండు రోజుల్లో కొత్త సీఈవోల నియామకం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో జిల్లాల విభజన ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఈ నెల 13న కేబినెట్ సమావేశం(Cabinet Meeting) తరువాత కొత్త జిల్లాల(New District) ప్రాతిపదికన సీఈవోలను ప్రభుత్వం నియమించనుంది. 28 జిల్లాలకు కొత్త సీఈఓలతో పాటు డిప్యూటీ సీఈఓలు, జీ.ఎస్.డబ్ల్యూ.ఎస్ అధికారులు, డీ.ఆర్.డీ.ఏ పీడీలు, డ్వామా పీడీలను ప్రభుత్వం నియమించనుంది. ఏప్రిల్ మొదటి వారంలో సీఈఓ, డిప్యూటీ సీఈఓ పోస్టులకు ఫైనాన్స్ శాఖ అప్రూవల్ జరగనుంది. ఇవి అయ్యాక స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లనుంది. ఈ నెల 20 తరువాత సమగ్ర సమాచారం రానుందని అధికార యంత్రాంగం తెలిపింది.

Next Story