- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరకట్ట నుంచి దూరం తగ్గింది.. అమరావతి దగ్గరైంది
విజయవాడ - అమరావతిల మధ్య తగిన దూరం.

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రుల రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు (Seed Access Road) పనులు వేగంగా పూర్తవుతున్నాయి. హైస్పీడ్ కనెక్టివిటీతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా 50 నుంచి 60 మీటర్ల వెడల్పుతో ఆర్టీరియల్ రహదారులను రానున్న వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తున్నారు. జాతీయ రహదారి - 16కు అనుసంధానంగా ఈ11, ఈ13, ఈ15 రహదారుల నిర్మాణం చేస్తున్నారు. ఈ క్రమంలో మరో 1.5 కిలో మీటర్ల రోడ్డు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీంతో విజయవాడ - అమరావతి మధ్య కరకట్ట నుంచి ప్రయాణ దూరం తగ్గింది.
శుక్రవారం రాజధాని అమరావతిలో (Amaravati) రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Ponguru Narayana) పర్యటించారు. తన పర్యటనలో భాగంగా సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు గుంటూరు ఛానల్ పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా అందుబాటులోకి వచ్చిన 1.5 కిలో మీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డు వల్ల విజయవాడ నుంచి అమరావతికి కరకట్టపై ప్రయాణ దూరం తగ్గిందన్నారు. కరకట్టపైకి వెళ్లే అవసరం లేకుండా త్వరలోనే స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. నెలాఖరు వరకు బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థను ఆదేశించామని వెల్లడించారు. మరో ఏడాది వ్యవధిలో ప్రధాన రోడ్డు పనులన్నీ నిర్మాణం అవుతాయన్నారు. ప్రస్తుతం ట్రంక్ రోడ్డు నిర్మాణాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.






