- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేట్లపాలెం బ్లాస్ట్.. పంటపొలాల్లో తల లభ్యం
కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా కేంద్రం జరిగిన పేలుళ్లలో మరొకరి తల స్థానిక పొలాల్లో లభ్యకావడం కలకలం రేపింది...

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District) సామర్లకోట మండలం(Samarla Kota Mandal) వేట్లపాలెం(Vetlapalem)లో బాణాసంచా తయారీ కేంద్రం(Fireworks Manufacturing Center)లో భారీ పేలుడు జరిగిన విషయం తెలిసిందే. అయితే వారిలో ఒకరి తల ఘటనా స్థలం నుంచి ఎగిరి వంద మీటర్ల దూరంలో స్థానిక పంట పొలాల్లో పడింది. ఈ రోజు ఆ తలను స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ తలను స్వాధీనం చేసుకున్నారు. అయితే పేలుడు దాటికి అందులో పని చేస్తున్న కార్మికుల శరీరాలు చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో ఆ శరీర భాగాలు ఎవరివో గుర్తు పట్టడం కష్టంగా మారింది. ఈ ఘటనలో చనిపోయిన 21 మందికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు వారికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ప్రస్తుతం పొలాల్లో దొరికి తల ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్లలో 21 మంది స్పాట్‌లోనే చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ సైతం ఒకరిద్దరు మృతి చెందారు. అయితే వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మరోవైపు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించింది. ఒక్కొక్కరికి రూ. 20 లక్షల చొప్పును ప్రభుత్వం తరపున కూటమి నాయకులు చెక్కులు అందజేశారు. ఈ నేపథ్యంలో మరొకరి తల లభ్యం కావడంతో మరోసారి ఈ ఘటనా కలకలం రేపింది.






