Polavaram: పోలవరం నిర్మాణంపైనే రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉంది: మంత్రి నిమ్మల

by Thanuru Gopichand |   (  Updated:2025-05-06 07:28:49  IST  )

పోలవరం నిర్మాణంపైనే రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

Polavaram: పోలవరం నిర్మాణంపైనే రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉంది: మంత్రి నిమ్మల
X

దిశ, డైనమిక్​ బ్యూరో: పోలవరం నిర్మాణంపైనే రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) పేర్కొన్నారు. ఈ రోజు ఆయన పోలవరం ప్రాజెక్ట్ వద్ద పర్యటించారు. ఎగువ కాఫర్ డ్యామ్ బలోపేతం చేసేలా నిర్మిస్తున్న బట్రస్ డ్యామ్, గ్యాప్-2 డి వాల్ పనులను ఆయన పరిశీలించారు. ప్యానల్ అఫ్ ఎక్స్పర్ట్స్ టీం ను మంత్రి నిమ్మల కలిశారు. పోలవరం ప్రాజెక్ట్ 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం అని నిపుణుల కమిటీకి ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) పోలవరం ప్రాజెక్ట్ కు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ప్రమాణస్వీకారం చేసిన వెంటనే పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి, పోలవరం ప్రాజెక్ట్ పైనే ఆధారపడి ఉంది, అని నిపుణులకు వివరించారు.

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి ఐతే, గోదావరి జలాలు కరువు ప్రాంతాలైన ఉత్తరాంద్ర, రాయలసీమ కు తరలించడం సాధ్యం అవుతుందన్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబుల లక్ష్యం అయిన నదుల అనుసంధానం పోలవరం ప్రాజెక్ట్ తో సాధ్యం అవుతుందని తెలిపారు. ఇప్పటికే గ్యాప్-2 లో డి వాల్ నిర్మాణం పనులు, బట్రస్ డ్యామ్ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. గ్యాప్ -1, గ్యాప్ -2,తో పాటు మిగిలిన ప‌నుల‌కు సంబందించిన డిజైన్స్ కు, త్వరిత గతిన అనుమ‌తులు ఇస్తే, అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయగలుగుతాం అని నిపుణులు వివరించారు. ప్యానల్ అఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ, సిడబ్ల్యూసి, పిపిఏ, ఆఫ్రి, మరియు ఏజెన్సీ లు సమన్వయం తో పని చేస్తూ లక్ష్యానికి ముందే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ఆయన సూచించారు.

Next Story