విజయనగరం జిల్లావాసుల మృతి బాధాకరం : మంత్రి అచ్చెన్నాయుడు

by Thanuru Gopichand |

తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసులు మృతి చెందడం బాధాకరం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

విజయనగరం జిల్లావాసుల మృతి బాధాకరం : మంత్రి అచ్చెన్నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసులు మృతి చెందడం బాధాకరం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లా వాసుల మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శబరిమలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోనులో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసానిచ్చారు.

మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతి

తమిళనాడు రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసులు మృతి చెందడం అత్యంత బాధాకరమని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. వారి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని మంత్రి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు దైవం ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరగడం అత్యంత విచారకరమని అన్నారు.

తమిళనాడు అధికారులతో మాట్లాడిన మంత్రి కొండపల్లి

తమిళనాడు రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసులు మరణించడం అత్యంత బాధాకరమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. బాధిత కుటుంబాలవారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాద విషయమై తమిళనాడు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని తమిళనాడు అధికారులను కోరామని మంత్రి కొండపల్లి తెలిపారు. క్షతగాత్రులతో పాటు ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాల వారికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీనిచ్చారు. రాత్రి వేళ ప్రయాణించేటప్పుడు వాహనదారులు తగిన జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలని ప్రజలను కోరారు.

కీళకరై పోలీస్ స్టేషన్ సమీపంలో

తమిళనాడు కీళకరై నుంచి ఎర్వడి వైపు వెళ్తున్న కారుకు కీళకరై పోలీసు స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన రెండు కార్లలోనూ అయ్యప్ప భక్తులున్నారు. వారిలో 4 మంది మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన 7 మందికి రామనాథపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారని పోలీసులు పేర్కొ్న్నారు. శబరిమల దర్శనం చేసుకొని రామేశ్వరం ప్రయాణమవుతుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Next Story