వైన్ షాపులో వ్యక్తి మృతి.. కల్తీ మద్యమే కారణమా..?

by Vemula.Srinu Prasad |

ఏలూరులో ఓ వైన్ షాపులో మద్యం తాగిన వ్యక్తి మృతి చెండడం కలకలం రేగింది..

వైన్ షాపులో వ్యక్తి మృతి.. కల్తీ మద్యమే కారణమా..?
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో నకిలీ మద్యం కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జరిగిన మరో ఘటన చర్చగా మారింది. మద్యం తాగిన వ్యక్తి మద్యం షాపులో మృతి చెందారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగింది. స్థానిక SR వైన్స్ షాపులో వృక్తి మృతి చెందారు. అయితే మృతదేహం ఉన్నప్పటికీ వైన్ షాపు కొనసాగింది. మద్యం అమ్మకాలు అలాగే సాగించారు. దీంతో స్థానికులు మండిపడ్డారు. మనిషి చనిపోయినా మద్యం వ్యాపారం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక వైన్ షాపులో మృతదేహం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానిక సీసీ టీవీ పుటేజులను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నకిలీ మద్యం తాగడం వల్లే వ్యక్తి మృతి చెందారని స్థానిక వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మృతికి కూడా ప్రభుత్వమే కారణమని విమర్శలు చేస్తున్నారు.

కాగా అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలుండటంతో ఘటన రాజకీయ దుమారం రేపింది. తెలుగుదేశం పార్టీ నేతలు నకిలీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. మద్యం తాగి చనిపోయిన ఘటనలపైనా ఆ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Next Story