- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRS ముక్కలయ్యే రోజులు దగ్గరపడ్డాయ్.. ఎంపీ మల్లు రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఏ క్షణాన ఎమ్మెల్సీ కవిత (Kavitha), కేసీఆర్ (KCR)కు లేఖ రాసిందో కానీ.. ఆ ఇష్యూ స్టేట్ పాలిటిక్స్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: ఏ క్షణాన ఎమ్మెల్సీ కవిత (Kavitha), కేసీఆర్ (KCR)కు లేఖ రాసిందో కానీ.. ఆ ఇష్యూ స్టేట్ పాలిటిక్స్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు లేఖలోని వివిధ అంశాలపై కవిత పూర్తిగా స్పష్టతను ఇవ్వనప్పటికీ.. ఆమె రాసిన లేఖపై మాత్రం అధికార పార్టీ నేతలు పంచ్ డైలాగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి (Mallu Ravi) మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ముక్కలయ్యే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీవ్ రావు, కవిత పార్టీలుగా మారిపోయాయని జోస్యం చెప్పారు. లేఖలో కవిత ప్రస్తావించిన దయ్యాలు ఎవరో అందరికీ తెలుసని సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ఇక భవిష్యత్తు లేదని కామెంట్ చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన ఆ పార్టీని జనం ఏనాడో మర్చిపోయారని మల్లు రవి ఫైర్ అయ్యారు.






