Breaking: ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు ముహూర్తం ఫిక్స్.. ఒక్క రోజులోనే ఎలక్షన్.. రిజల్ట్స్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-28 06:59:42  IST  )

ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు ముహూర్తం ఫిక్స్ అయింది...

Breaking: ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు ముహూర్తం ఫిక్స్.. ఒక్క రోజులోనే ఎలక్షన్.. రిజల్ట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నిక(AP BJP President Election)కు ముమూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 30న నామినేషన్, అదే రోజు ఉపంసహరణ ప్రక్రియ జరగనుంది. జులై 1న ఎన్నిక.. అదే రోజు అధ్యక్ష ప్రకటన ఉంటుందని పలువురు బీజేపీ నాయకులు అంటున్నారు. కొంతకాలంగా కొత్త అధ్యక్షులను ఎన్నుకోవాలని డిమాండ్ ఉంది. దీంతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచన బీజేపీ హైకమాండ్ చేసింది.

కాగా ప్రస్తుతానికి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎమ్మెల్యే పురంధేశ్వరి కొనసాగుతున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కూటమిలో భాగస్వామికి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ చురుగ్గానే ఉంటుంన్నారు. కానీ రాష్ట్రానికి కొత్త అధ్యక్షులు కావాలనే డిమాండ్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. కొద్ది రోజులుగా అధ్యక్ష బరిలో దిగాలని పలువురు ఆశావహుల ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల కానుండటంతో ఇప్పటి నుంచే పార్టీ అధిష్టానం, కీలక నేతల వద్ద మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే పార్టీ అధిష్టానం వద్దకు పలువురి పేర్లతో కూడిన జాబితా వెళ్లినట్లు సమాచారం. ఈ లిస్టును ఇప్పటికే పరిశీలించినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Next Story