బాలికపై అత్యాచారం.. పోస్కో కోర్టు సంచలన తీర్పు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-19 13:46:27  IST  )

బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఇద్దరికి జీవిత ఖైదుతో పాటు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది..

బాలికపై అత్యాచారం.. పోస్కో కోర్టు సంచలన తీర్పు
X

దిశ, కడప ప్రతినిధి: మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో ఇద్దరు ముద్దాయిలకు జీవిత ఖైదు జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2 వేలు జరిమానా విధిస్తూ పోస్కో కోర్టు ఇన్ఛార్జీ జడ్జి, మూడవ ఏ.డి.జె జడ్జి ఎస్ ప్రవీణ్ కుమార్ తీర్పు ఇచ్చారు. ప్రొద్దుటూరు పరిధిలో పఠాన్ సాదక్ అలియాస్ చెంబు(19), బొంపెం సిపాయి చెన్నయ్య అలియాస్ చెన్నయ్య (39) బాలికను మభ్యపెట్టి 2022లో బాలికను గర్భవతి చేశారంటూ బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. డి.ఎస్పీ వై ప్రసాద్ రావు విచారణ చేసి చార్జ్ షీట్ దాఖలు చేశారు. స్పెషల్ అడిషనల్ పి.పి కె వేణుగోపాల్ ఆధ్వర్యంలో సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచి సాక్ష్యాధారాలతో నేర నిరూపణ చేశారు. దీంతో నిందితులకు కోర్టు శిక్ష ఖరారు చేసింది.

మరో పోస్కో కేసులోనూ 10 ఏళ్ళు జైలు


వైయస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో మైనర్ బాలికను వెంటపడి వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తించి ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ప్రొద్దుటూరు పట్టణం ఇందిరానగర్ చెందిన గడివేముల అశోక్ కుమార్ అనే ముద్దాయికి 10 సంవత్సరాల శిక్ష విధిస్తూ రాజంపేట ఎడిజే, కడప పోస్కోకోర్టు ఇన్చార్జి జడ్జి ప్రవీణ్ కుమార్ తీర్పునిచ్చారు .13 సంవత్సరాల మైనర్ బాలికను వేధించడంతో ఆమె కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.‌ బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు ముద్దాయికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Next Story