మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసు: పెద్దిరెడ్డి పీఏ, అనుచరుడికి రిమాండ్

by Vemula.Srinu Prasad |

మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఫైల్స్ దగ్ధం కేసులో నిందితులకు ధర్మాసనం రిమాండ్‌ విధించింది. ఈ కేసులో నిందితులు పెద్దిరెడ్డి పీఏ మునితుకారం, ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిని బుధవారం అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం ప్రత్యేక సీఐడీ కోర్టు ఎదుట హాజరుపర్చారు.

మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసు: పెద్దిరెడ్డి పీఏ, అనుచరుడికి రిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: మదనపల్లె ఆర్డీవో కార్యాలయం(Madanapalle RDO Office)లో జరిగిన ఫైల్స్ దగ్ధం కేసు(Files Burning Case)లో నిందితులకు ధర్మాసనం రిమాండ్‌(Remand) విధించింది. ఈ కేసులో నిందితులు పెద్దిరెడ్డి పీఏ మునితుకారం, ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిని బుధవారం అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం ప్రత్యేక సీఐడీ కోర్టు(Special CID Court) ఎదుట హాజరుపర్చారు. ఇరువర్గాల వాదనలు విన్న ఇన్‌ఛార్జి జడ్జి... నిందితులకు ఏప్రిల్‌ 1 వరకు రిమాండ్‌ విధించారు. దీంతో మాధవరెడ్డి, మునితుకారాంను చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో ఆరోపణలు వచ్చినప్పటి నుంచి తుకారం, మాధవరెడ్డి తప్పించుకుని తిరుగుతున్నారు. బుధవారం గాదంకి టోల్‌ప్లాజా వద్ద ఇద్దరిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story