బాక్సర్ల అసమాన విజయంతో దేశం గర్విస్తోంది : మాజీ ఉపరాష్ట్రపతి

by Thanuru Gopichand |

నోయిడా వేదికగా జరిగిన ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025లో (World Boxing Cup Finals 2025) భారతీయ బాక్సర్లు సత్తాను చాటారు.

బాక్సర్ల అసమాన విజయంతో దేశం గర్విస్తోంది : మాజీ ఉపరాష్ట్రపతి
X

దిశ, వెబ్ డెస్క్ : నోయిడా వేదికగా జరిగిన ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025లో (World Boxing Cup Finals 2025) భారతీయ బాక్సర్లు సత్తాను చాటారు. వారి ప్రతిభను కొనియాడుతూ భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు (M Venkaiah Naidu) ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ఈ మేరకు తన ఎక్స్ వేదికపై విజేతలకు శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో భారత బాక్సర్ల అసమాన విజయానికి దేశం గర్విస్తోందని మాజీ ఉపరాష్ట్రపతి అన్నారు. అద్భుతమైన క్రీడా పోరాట స్ఫూర్తితో 9 స్వర్ణాలతో సహా మొత్తం 20 పతకాలు గెలిచి చారిత్రక విజయం నమోదు చేసినందుకు వారందరికీ హృదయపూర్వక అభినందనలను తెలియజేశారు. ముఖ్యంగా తన అద్భుతమైన పంచ్ లతో పసిడి పతకాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ కు చెందిన నిఖత్ జరీన్ కు ప్రత్యేక అభినందనలను తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. మున్ముందు కూడా ఇదే స్ఫూర్తితో భారత క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై అద్భుతమైన విజయాలు నమోదు చేస్తారని విశ్వసిస్తున్నానని తెలిపారు.

Next Story