- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PSLV-C61 ప్రయోగానికి కౌంట్‌డౌన్.. రేపు ఉదయం నింగిలోకి రాకెట్
PSLV-C61 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది...

దిశ, వెబ్ డెస్క్: PSLV-C61 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ ఉదయం 7.59 గంటల నుంచి 22 గంటల పాటు కౌంట్‌డౌన్ కొనసాగనుంది. ఆదివారం ఉదయం 5:59 గంటలకు నింగిలోకి రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఇప్పటికే చెంగాలమ్మ(Chengalamma)ను ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాగా శ్రీహరి కోట షార్(Srihari Kota Shar) నుంచి ఈ ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. ఈమేరకు సర్వం సిద్ధం చేశారు. జాతీయ భద్రతను బలోపేతం చేసేందుకు, కీలకమైన మౌలిక సదుపాయల కల్పనకు దోపదపడేలా ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఈ ఉపగ్రహంలో సీ-బ్యాడ్ సింథటిక్ అపార్చర్ రాడార్(Sea-bed synthetic aperture radar)ను అమర్చారు. దీని ద్వారా పగలు, రాత్రి సమయంలో వాతావరణ పరిస్థితులను తెలుసుకుంటారు. భూమి ఉపరితలం నుంచి అధిక రిజల్యూషన్ కలిగిన ఫొటోలను సైతం సంగ్రహించనున్నారు. ఉగ్రశిబిరాలు, కార్యకలాపాలను కూడా తెలుసుకోనున్నారు.అలాగే సరిహద్దులో సైనికుల కదిలకలను కూడా ఈ ఉపగ్రహం ద్వారా సమాచారం తెలుసుకోనున్నారు.






