ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలకు నోటీసులు.. విచారణకు రావాలని మండలి చైర్మన్ ఆదేశం

by Vemula.Srinu Prasad |

ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26న విచారణ రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు...

ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలకు నోటీసులు.. విచారణకు రావాలని మండలి చైర్మన్ ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీల(Ycp Mlc)కు మండలి చైర్మన్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26న విచారణ రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా వైసీపీ ఎమ్మెల్సీలు కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్‌తో పాటు జయమంగళ వెంకట రమణ రాజీనామా చేశారు. ఈ లేఖను మండలి చైర్మన్‌కు పంపారు. అయితే ఈ లేఖలను పరిశీలించిన ఏపీ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు(AP Legislative Council Chairman Koyye Moshen Raju) తాజాగా వారికి నోటీసులు జారీ చేశారు. జయమంగళ వెంకట రమణను మాత్రం ఈ నెల 25నే హాజరుకావాలని నోటీసుల్లో మోషన్ రాజు పేర్కొన్నారు. జగన్ హయాంలో కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్‌, జయమంగళ వెంకట రమణకు వైసీపీ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు. అయితే ప్రభుత్వం మారడంతో వీరు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అంతేకాదు వేర్వేరు పార్టీలో చేరారు. దీంతో మండలి చైర్మన్ నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టడంతో వారంతా కోర్టుకు వెళ్లి తమ రాజీనామాలకు త్వరగా ఆమోదించాలని కోరారు. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్ మోషెన్ రాజు నోటీసులు జారీ చేశారు. దీంతో ఎమ్మెల్సీ వ్యవహారంపై ఉత్కంఠ నెలకొంది.

Next Story