- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో కాంగ్రెస్ పాదయాత్ర.. షెడ్యూల్ ఖరారు
ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టిసారించింది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap Congress)లో కాంగ్రెస్ పార్టీ(Congress Party) బలోపేతంపై దృష్టిసారించింది. ఈ మేరకు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లు స్థబ్దుగా ఉన్న కార్యకర్తలను మళ్లీ యాక్టివ్ చేసేందుకు ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు మూడు రోజుల పాటు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగింపుపై నిరసనకు పిలుపునిచ్చారు.
గాంధీ సందేశయాత్ర పేరుతో...
గాంధీ సందేశయాత్ర(Gandhi Sandesa Yatra) పేరుతో పార్టీ సీనియర్ నేత రఘువీరా రెడ్డి(RaghuVeera Reddy) ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన తేదీల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ నెల 28, 29,30న రఘువీరారెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పథకాలను ప్రజలు మర్చిపోవాలనే కుట్రతోనే ఉపాధి హామీ పథకంపై గాంధీ పేరును కేంద్రప్రభుత్వం తొలగిస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రం తన వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.






