కలుషిత ఆహారం తిన్న బాలిక పరిస్థితి విషమం.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-16 14:30:58  IST  )

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన బాలిక పరిస్థితి విషమించింది..

కలుషిత ఆహారం తిన్న బాలిక పరిస్థితి విషమం.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన
X

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Seetharamaraju District) పాడేరులో కలుషిత ఆహారం(Alluri Seetharamaraju District) తిని అస్వస్థతకు గురైన బాలిక పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను విశాఖ కేజీహెచ్‌(Visakha Kgh)కు తరలించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాడేరు మొదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలు(Visakha Kgh) జరుగుతున్నాయి. దీంతో అనకాపల్లి జిల్లా నాతవరానికి చెందిన 20 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో వారితో తీసుకెళ్లిన భోజనాన్ని తిన్నారు. దీంతో 14 మంది భక్తులు ఒక్కసారిగా వాంతులు, కడుపు నొప్పితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే వారందరిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విశాఖ జీజీహెచ్‌కు తరలించారు. మిగిలిన 13 మందికి పాడేరు జిల్లా ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. వారందరూ కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.

Next Story