ఏపీ సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు

by Thanuru Gopichand |

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజులపాటు జరగనున్న కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది.

ఏపీ సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు
X

దిశ, వెబ్ డెస్క్ : సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజులపాటు జరగనున్న కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. సుపరిపాలన, సుస్థిరాభివృద్ధి, సంక్షేమం అజెండాగా సదస్సు జరగనుంది. సదస్సుకు డిప్యూటీ సీఎం పవన్, లోకేష్, సహా వివిధ శాఖల మంత్రులు హాజరయ్యారు. గత నాలుగు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు జీఎస్డీపీ, వృద్ధి లక్ష్యాలు, సంపద సృష్టిపై దృష్టి సారించడం, పర్యాటక రంగం, స్థానిక వనరుల వినియోగం, రెవెన్యూ, చట్టపరమైన అంశాలు, ఉద్యోగావకాశాల సృష్టి, మౌలిక సదుపాయాలు, పెద్ద ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. వివిధ అంశాలపై చర్చించి ఒక రోడ్ మ్యాప్ తో ప్రభుత్వం ముందుకెళ్తోంది. గత మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై సదస్సులో చర్చించనున్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించాలని, పటిష్ట పరచాలని సదస్సును నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సమిష్టిగా పని చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చేపట్టవలసిన కార్యాచరణపై సదస్సులో సమాలోచనలు జరపనున్నారు. గవర్నెన్స్ అంటే అకౌంటబులిటీ, గవర్నెన్స్ అంటే ట్రస్ట్, గవర్నెన్స్ అంటే ఇక్విటీ అండ్ ఇంక్లూజివిటీ అని నమ్మి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అయితే జీఎస్డీపీ కేపీఐ, పబ్లిక్ పర్షపన్, ఈ ఆఫీస్, ఫైళ్ల పరిష్కారం, కేంద్ర పథకాలు, పెట్టుబడులపై ప్రతిపాదనలు వంటి అంశాలపై నేడు సీఎం ప్రసంగించనున్నారు.

కలెక్టర్ల సదస్సు కీలక భూమిక పోషిస్తుంది : సీఎస్ కె.విజయానంద్

కలెక్టర్ల సదస్సులో సీఎస్ కె.విజయానంద్ ప్రారంభోపన్యాసం చేశారు. పాలనా సమీక్షకు కలెక్టర్ల సదస్సు కీలక భూమిక పోషిస్తోందన్నారు. మొంథా సైక్లోన్ సమయంలో వేగంగా స్పందించిన జిల్లా కలెక్టర్లందరికీ అభినందనలను తెలియజేశారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ సహా మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ దీర్ఘకాలిక లక్ష్యాలు, జిల్లాల అభివృద్ధి, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ప్రజల్లో సంతృప్త స్థాయి వంటి అంశాలపై చర్చించుకుందామని పేర్కొన్నారు. ఆరు జిల్లాల కలెక్టర్లు తాము అవలంభించిన బెస్ట్ ప్రాక్టీసెస్ ను ప్రెజెంట్ చేయబోతున్నారని వెల్లడించారు. రహదారి భద్రతపై కూడా అంతా దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. ఈ ఆంశంపైనా సమావేశాల్లో విస్తృతంగా చర్చించాల్సి ఉందన్నారు.

Next Story