- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోటుపల్లిలో కూలిపోయిన 400 ఏళ్ల నాటి మండపం..
రెండు వేల ఏళ్ల చరిత్ర కలిగిన అంతర్జాతీయ రేవు పట్టణం, వర్తక కేంద్రమైన మోటుపల్లిలో 16వ శతాబ్ది నాటి నాలుగు స్తంభాల మండపం కూలిపోయిందని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డాక్టర్ ఈమని శివ నాగిరెడ్డి తెలిపారు.

దిశ, ఒంగోలు, చిన్నగంజాం : రెండు వేల ఏళ్ల చరిత్ర కలిగిన అంతర్జాతీయ రేవు పట్టణం, వర్తక కేంద్రమైన మోటుపల్లిలో 16వ శతాబ్ది నాటి నాలుగు స్తంభాల మండపం కూలిపోయిందని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డాక్టర్ ఈమని శివ నాగిరెడ్డి తెలిపారు. మోటుపల్లి హెరిటేజ్ సొసైటీ కార్యదర్శి రొండా దశరథ రామి రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఆయన బుధవారం నాడు మోటుపల్లి రామాలయంలో కూలిపోయిన నాలుగు స్తంభాల మండప శిధిలాలను పరిశీలించారు.
చోళుల కాలంలో నిర్మింపబడి కాకతీయుల కాలంలో పునరుద్దింపబడిన రామాలయం (ప్రసన్న కేశవాలయం) ముందు ఎడమవైపున క్రీ.శ. 6వ శతాబ్దంలో విజయనగర వాస్తు శైలిలో నిర్మింపబడిన నాలుగు స్తంభాల మండపము ఇటీవల వర్షాలకు పునాదులు కింద ఇసుక తొలగిపోయి కూలిపోయిందని ఆయన అన్నారు. స్తంభాలపై నాగదేవతల శిల్పాలు, కప్పు రాళ్లపై పద్మాలు చెక్కి ఉన్నాయని కూలిన రాళ్లు ఒకదానిపై ఒకటి కుప్పగాపడి ఉన్నాయని ఆధునిక పునాదులపై చారిత్రక ప్రాధాన్యత గల ఈ మండపాన్ని మళ్లీ కట్టాలని గ్రామ ప్రజలకు, ఆలయ అధికారులకు, కమిటీ సభ్యులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్టు, బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య , రొండా దశరధ రామిరెడ్డి పాల్గొన్నారని ఆయన చెప్పారు.






