- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mayor visakha, guntur: కూటమికే.. మేయరు పీఠం
విశాఖ, గుంటూరు మేయర్ ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది.

గుంటూరు, విశాఖ మేయరు పదవులు కూటమి సొంతం
మిగిలిన చోట్లా కూటమిదే హవా
దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖ, గుంటూరు మేయర్ ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. ఈ రెండు స్థానాలను కూటమి ఏకపక్షంగా సొంతం చేసుకుంది. విశాఖ మహానగర పాలక సంస్థ మేయర్ గా కూటమి అభ్యర్థి పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికైనట్లు జాయింట్‌కలెక్టర్ మయూర్‌అశోక్ ధ్రువపత్రాన్ని అందజేశారు. దీంతో కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. విశాఖ మేయర్ పీఠాన్ని కూడా ఇటీవల వైసీపీ కోల్పోయిన సంగతి తెలిసిందే. విశాఖ మేయర్‌గా ఉన్న గొలగాని హరి వెంకట కుమారిపై కూటమి సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. ఓటింగ్‌లో మూడింట రెండు వంతుల మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. దీంతో విశాఖ మేయర్ పదవి నుంచి గొలగాని హరి వెంకట కుమారిని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి అటు వైసీపీ, ఇటు కూటమి క్యాంపు రాజకీయాలను నడిపించాయి. వైసీపీ కార్పొరేటర్లు మైసూరులో, కూటమి కార్పొరేటర్లు విదేశాల్లో క్యాంపులలో ఉంచారు. ఎన్నికకు రెండు రోజుల ముందుగా వారిని విశాఖకు తరలించారు. పీలా శ్రీనివాస్పేరును జనసేన, బీజేపీ కార్పొరేటర్లు బలపరిచారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎనన్నికైనట్లు ప్రకటించారు.
గుంటూరు మేయర్ ఎన్నిక నిన్నటి వరకు ఏకపక్షమే అని భావించిన మేయర్ ఎన్నికల్లో వైసీపీ ఎంట్రీ ఇచ్చింది. మేయరు పదవి కోసం టీడీపీ (TDP) నుంచి కోవెలమూడి రవీంద్ర పోటీ చేయగా, వైసీపీ (YCP) నుంచి కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డిని పోటీలో నిలిపారు. ఎన్నిక జరగగా గుంటూరు మేయుగా కోవెలమూడి రవీంద్ర విజయం సాధించారు. రవీంద్రకు అనుకూలంగా 34 మంది ఓటు వేశారు. 27 మంది వైసీపీ అభ్యర్థి వెంకటరెడ్డికి ఓటు వేశారు. మరో ఇద్దరు వైసీపీ సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో రవీంద్ర విజయం సాధించినట్లు ప్రకటించారు.
కుప్పం మున్సిపల్చైర్మన్గా సెల్వరాజ్ ఎన్నికయ్యారు. మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్‌పర్సన్‌గా ఆకుల మల్లీశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది. అదే విధంగ తుని పునపాలక సంస్థ చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులను టీడీపీ దక్కించుకుంది. చైర్‌పర్సన్‌గా నార్ల భువన సుందరి ఎన్నికయ్యారు. వైస్‌చైర్మన్‌గా ఆచంట సురేష్న ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు వైసీపీ సభ్యులు గైర్హాజరయ్యారు.






