- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి లోకేశ్ సమక్షంలో కీలక ఒప్పందాలు
ఏపీకి పెట్డుబడులు రాబట్టేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)కి పెట్డుబడులు రాబట్టేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన పరిస్థితులు ఉన్నాయంటూ ఆయా కంపెనీలకు వివరిస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఇప్పటికే కొన్ని కంపెనీలు సుముఖుత చూపాయి. కంపెనీల ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరికొన్ని కంపెనీలు త్వరలో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ప్రభుత్వంతో రెండు కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి.
మరోవైపు యువతకు ఉపాధే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సైయెంట్ ఫౌండేషన్, AICTE సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆయా కంపెనీల ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. యువతలో వ్యాపార నైపుణ్యంతో పాటు స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి ఈ సంస్థలు సహకారం అందించనున్నాయి. అలాగే మంత్రి నారా లోకేష్ సమక్షంలో APSS DC అవగాహన ఒప్పందం కూడా కుదిరింది.






