- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో భారీ సంఖ్యలో బోగస్ రేషన్ కార్డులు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం(Kutami Government) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పలు పభుత్వ పథకాలు అమలు చేస్తోంది. పేదలకు అండగా నిలబడేందుకు సూపర్ సిక్స్ పథకాల(Super Six Schemes)ను ఒక్కొక్కటిగా అమల్లోకి తీసుకొస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(Free Bus Travel) మినహా ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను ప్రభుత్వం నెరవేర్చింది. ప్రస్తుతం పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. పేదలకు మాత్రమే రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులపై రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు సమాచారం అందించారు. ఈకేవైసీ నమోదు చేసి కొత్త రేషన్ కార్డులు(News Ration Cards) జారీ చేయాలనే మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సర్వే అధారంగా అనర్హులను గుర్తించి కార్డులను తీసి వేయాలని ఆదేశించారు.
దీంతో కొత్త రేషన్ కార్డుల వెరిఫికేషన్‌ను అధికారులు మొదలు పెట్టారు. లక్షల సంఖ్యలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. ఈ సర్వేతో బోగస్ కార్డులను ఎత్తివేసేందుకు అటు అధికారులు సైతం సిద్ధమయ్యారు. వైఎస్ జగన్ ప్రభుత్వం(Ys Jagan Government)లో బోగస్ రేషన్ కార్డులు భారీగా నమోదు అయ్యాయని, వాటిని ఈ ప్రభుత్వం తీసివేయాలని నిర్ణయించిందని, ఇది మంచి పరిణామమని కూటమి నాయకుల అంటున్నారు. అర్హులకు మాత్రమే రేషన్ సరుకులు అందాలనేదే ప్రభుత్వం లక్ష్యమని చెబుతున్నారు.






