నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నైపుణ్యం జాబ్ పోర్టల్‌ ప్రకటించిన మంత్రి

by Vemula.Srinu Prasad |

నిరుద్యోగ సమస్య పరిష్కారమే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నైపుణ్యం జాబ్ పోర్టల్‌ ప్రకటించిన మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: నిరుద్యోగ(Un Employees) సమస్య పరిష్కారమే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించాలని తీవ్రంగా కృషి చేస్తోంది. వివిధ కంపెనీలను రాష్ట్రంలో నెలకొల్పితే నిరుద్యోగ సమస్య తీరుతుందని ఆకాంక్షిస్తోంది. లోకల్ యువత(Youths)కు ఇతర రాష్ట్రాల్లోనూ ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పని చేస్తోంది. ఈ మేరకు సరికొత్త ప్లాన్‌ను అమలు చేసేందుకు రెడీ అవుతోంది. నిరుద్యోగుల్లో స్కిల్స్ పెంచేందుకు ఇప్పటికే విద్య, ఐటీ శాఖల ద్వారా వివిధ కార్యక్రమాలను చేపడుతోంది.


తాజాగా సరికొత్త జాబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేశ్(Minister Nara lokesh) తీవ్రంగా పయత్నం చేస్తున్నారు. నైపుణ్యం పేరుతో జాబ్ పోర్టల్‌(Skill Job Portal)ను ప్రకటించారు. ఈ పోర్టల్‌ను సెప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. నిరుద్యోగులు, ఉపాధి కల్పన సంస్థల మధ్య వేదికగా ఈ పోర్టల్ పని చేస్తుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

Next Story