- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Good News: ఇకపై రెండు పూటలు రేషన్ సరుకులు
ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది...

దిశ, వెబ్ డెస్క్: ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రేషన్ పంపిణీ వ్యవస్థలో ప్రక్షాళన చేపట్టింది. అయితే కొన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి రావడంతో రేషన్ వ్యవస్థలో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ రేషన్ పంపిణీ విధానంలో పలు మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. గతంలో 15 రోజులపాటు రేషన్ బియ్యం ఇచ్చేవారని, అది ఉదయం మాత్రమేనని, సాయంత్రం కూడా ఇవ్వాలని ప్రజల నుంచి తమకు వినతులు వచ్చాయని పేర్కొన్నారు.
ఈ మేరకు రేషన్ దుకాణాల్లో ఇకపై రెండు పూటలు పీడీఎస్ బియ్యం పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. గతంలో రేషన్ బియ్యం ఇచ్చే వాహనం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఆ పరిస్థితులు ఉండకూడదన్నారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15 రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, సాయంత్రం 4 గంటల నుంచి 8 వరకూ రేషన్ సరుకులు పంపిణీ చేస్తారని వెల్లడించారు. ఇకపై రెండు పూటలు రేషన్ సరుకులు ఇస్తారని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.






