కలెక్టర్లకు చంద్రబాబు మళ్లీ క్లాస్.. క్షేత్ర స్థాయికి వెళ్లాలని ఆదేశం

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ప్రతి నెల పెన్షన్లు డైరెక్ట్ ఇంటికే తీసుకెళ్లి రూ. 4 వేల నగదు అందిస్తున్నారు....

కలెక్టర్లకు చంద్రబాబు మళ్లీ క్లాస్.. క్షేత్ర స్థాయికి వెళ్లాలని ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం(Kutami Government) చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ప్రతి నెల పెన్షన్లు డైరెక్ట్ ఇంటికే తీసుకెళ్లి రూ. 4 వేల నగదు అందిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) సైతం ప్రతి నెల 1వ తేదీన, సెలవు ఉంటే ఆ ముందే ఏదో ఓ చోట లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు(Pension Cash) పంపిణీ చేస్తున్నారు. ఇలా కొత్త, పాత పథకాలను ఇంటింటికెళ్లి అందిస్తు్న్నారు. అయితే ఫీడ్ బ్యాక్‌లో కలెక్టర్లు, అధికారుల పని తీరుపై మిశ్రమ స్పందన వస్తోంది. దీంతో కలెక్టర్లందరూ క్షేత్ర స్థాయికి వెళ్లాల్సిందేనని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

అమరావతిలో కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు ఆయన క్లాస్ తీసుకున్నారు. ‘‘ కలెక్టర్లు కనీసం 8 రోజులు, సీనియర్ సెక్రటరీలు 4 రోజులపాటు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే. సంబంధిత వివరాలతో పోర్టల్ తయారు చేయాలి. అలాగే ఆన్‌లైన్‌లో పెట్టేలా సీఎస్ బాధ్యత తీసుకోవాలి. క్షేత్రస్థాయి అధికారులను కలెక్టర్లే అప్రమత్తం చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును సమర్థంగా అమలు చేయాలి. రూ. 72 లక్షల మందికి వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు స్క్రీనింగ్‌లో తేలింది. ప్రతి ఇంటికి సురక్షిత నీరు అందించాలి. వైఎస్ జగన్(Ys Jagan) ప్రభుత్వం చేసిన తప్పు వల్ల జేజేఎం కింద నిధులు కోల్పోయాం.’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Next Story