- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. యాప్ ద్వారా పని భారం తగ్గింపు
ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం పని భారం తగ్గించింది...

దిశ, కారంపూడి: ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం పని భారం తగ్గించింది. ఇంతకు ముందు ప్రతి దానికి విధ యాప్‌లో వివరాల నమోదుకు ఆపసోపాలు పడేవారు. ఇప్పుడు ఒకే యాప్‌లో అన్ని సేవలు, విధులు నమోదు చేసుకునేలా లెర్నింగ్ ఎక్స్‌లెన్స్‌ఇన్ ఆంధ్రప్రదేశ్ (లీప్) యాప్‌ను కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు, ప్రభుత్వ సమాచారం, ఖాళీల వివరాలు, గవర్నెన్స్, డాష్ బోర్డు నిక్షిప్తం చేశారు. దీని పనితీరుపై ఉపాధ్యాయులు పరిశీలన చేస్తున్నారు. గతంలో వివిధ యాప్‌లో వివరాలు నమోదు చేసేందుకు సర్వర్ మొరాయించడం వంటి సాంకేతిక సమస్యలతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడేవారు. విద్యార్థుల హాజరు, వంట నిర్వహణ, మరుగుదొడ్ల చిత్రాల అప్లోడ్, సెలవుల నమోదుకు ఇక్కట్లు ఎదురయ్యేవి. పాఠ్య పుస్తకాల పంపిణీ, మన బడి జిల్లాలో వివరాలు పూర్తిగా సమాచారం అందుబాటులోకి తెచ్చారు.
నాడు నేడు, పీఎంశ్రీ తదితర వివరాల నమోదుకు వేర్వేరు యాప్‌లు ఉండేవి. వాటి ఐడీలు, పాస్వర్డు గుర్తు పెట్టుకోలేక, సెలవు రోజుల్లో ఇతరులకు ఆ విరాలు ఇవ్వలేక ఇబ్బందులు పడేవారు. హాజరుకు నెట్వర్క్ లేక గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. తాజాగా ముఖ ఆధారిత హాజరు గుర్తింపు సంఖ్య పాస్వర్డ్ లీప్ యాప్‌లో లాగిన్ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. సాంకేతికంగా మెరుగుపరిస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారంప్రభుత్వం తీసుకువచ్చిన లీప్ యాప్ ఉపాధ్యాయులకు ఎంతో ప్రయోజనకరం ఉన్నది అని చెప్పవచ్చు. వీటిలో ఉత్తర్వులు, బదిలీలు, నోటిఫికేషన్లు తదితర వివరాల తాజా సమాచారం యాప్‌లో తెలుసుకోవచ్చు. పాఠశాలల్లోని అన్ని కార్యక్రమాలు, వివరాల నమోదుకు ఈ లిప్ యాప్ ద్వారానే చేయవచ్చు అని అంటున్నారు. కారంపూడి యంఈఓ రవికుమార్‌ను దిశ రిపోర్టర్ వివరణ కోరగా ‘ఈ యాప్ చాలా బాగుంది. ఉపాధ్యాయులకు సులభంగా యాప్‌లో వివరాలు నమోదు చేయవచ్చు. ఒకే యాప్, ఒకే పాస్వర్డ్ చాలా తేలికగా గుర్తు ఉంటుంది’. అని తెలిపారు






