అమరావతి చట్టబద్ధతకు రంగం సిద్ధం.. త్వరలో కేబినెట్ ముందుకు బిల్లు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-21 10:21:04  IST  )

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్ధతకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది..

అమరావతి చట్టబద్ధతకు రంగం సిద్ధం.. త్వరలో కేబినెట్ ముందుకు బిల్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(Ap Capital Amaravati)ని చట్టబద్ధత చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రం తరపున ఇందుకు కావాల్సిన అన్ని చర్యలను పూర్తి చేసింది. ముందుగా కేబినెట్‌లో చర్చించేందుకు సిద్ధమవుతోంది. ఇక్కడ ఆమోదం తెలిపిన తర్వాత ఆ ఫైలును పార్లమెంట్‌కు పంపాలని డిసైడ్ అయింది.

ఏపీ పునర్ వ్యవస్థీరణతో...

కాగా ఏపీ పునర్ వ్యవస్థీరణతో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్లపాటు కొనసాగింది. అయితే ఏపీ రాజధాని అమరావతిని ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఒప్పుకుని అసెంబ్లీ, హైకోర్టుతో పాటు పలు ప్రభుత్వం కార్యాలయాలను అక్కడ నిర్మించారు. 2014-2019 వరకూ అమరావతి రాజధాని కేంద్రంగా పాలన సాగింది. అయితే 2019 ఎన్నికల తర్వాత అమరావతి నుంచే కార్యకలాపాలు సాగినా మూడు రాజధానులు తెరపైకి వచ్చాయి. దీంతో ఏపీకి రాజధాని లేదనే ప్రచారం జరిగింది.

ఊపందుకున్న అమరావతి చట్టబద్ధత ప్రతిపాదన

అయితే రాజధాని అమరావతిని చట్టబద్ధత అయితే ఈ సమస్య రాదు కదా అనే ప్రతిపాదన ఊపందుకుంది. ఇందులో భాగంగా అమరావతిని చట్టబద్ధత చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేసింది. అంతేకాదు వేగంగా అడుగులు వేసింది. తమ హయాంలోనే అమరావతికి చట్టబద్ధత తీసుకురావాలనే సంకల్పంతో ప్రయత్నాలు మొదలు పెట్టింది. తాజాగా కేబినెట్‌లో చర్చించి ఆ తర్వాత పార్లమెంట్ వేదికగా రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత తీసుకురాలనే ప్లాన్ చేస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Next Story