- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం... 19 సంస్థల ప్రతిపాదనలపై చర్చ
రాష్ట్రాభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెంచింది....

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రాభివృద్ధిపై కూటమి ప్రభుత్వం(Kutami Government) ఫోకస్ పెంచింది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీ ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఈ మేరకు ఆయా కంపెనీలతో సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అధ్యక్షతన సమావేశం అమరావతి సెక్రటేరియట్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు(Ap Investment Promotion Board) సభ్యులు హాజరయ్యారు. ఈ మేరకు 19 సంస్థల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నారు. మొత్తం రూ.28,546 కోట్లు పెట్టుబడులు, 30,270 మందికి ఉపాధి కల్పన అంచనాలతో ప్రతిపాదనలు రెడీ చేశారు. ఈ ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సమావేశం తర్వాత అధికారికంగా ప్రకటన చేయనున్నారు.






