సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అలవెన్స్ మరో ఏడాది పెంపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-04 09:21:12  IST  )

ఏపీలో సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం) గుడ్ న్యూస్ తెలిపింది...

సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అలవెన్స్ మరో ఏడాది పెంపు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో సచివాలయ ఉద్యోగుల(Secretariat Employees)కు కూటమి ప్రభుత్వం(Kutami Government) గుడ్ న్యూస్ తెలిపింది. ఉద్యోగుల హెచ్ఆర్ఏ(HRA)ను మరో సంవత్సరం పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.. 2022 పీఆర్సీ(PRC) ప్రకారం హెచ్‌ఆర్ఏ‌ను 24 శాతం పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు సచివాయల ఉద్యోగులు, హెచ్ఓడీలకు వర్తిస్తుందని వెల్లడించింది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తాజాగా ఈ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుంది. గత ప్రభుత్వం పీఆర్సీ విషయంలో తమను మోసం చేసిందని ఉద్యోగులు పలు మార్లు ఆరోపించారు. దీంతో తాము అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోవడంతో సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అద్దె అలవెన్స్‌ను మరో ఏడాది పెంపుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది.

Next Story