ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు.. పొదుపు నిధుల విడుదల

by Vemula.Srinu Prasad |

ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త వినిపించింది. గతంలో నిలిచిపోయిన స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ నిధులను తిరిగి చెల్లించేందుకు నిర్ణయించింది....

ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు.. పొదుపు నిధుల విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల(APSRTC Employees)కు కూటమి ప్రభుత్వం(Government) శుభవార్త వినిపించింది. గతంలో నిలిచిపోయిన స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ (SRBS) నిధులను తిరిగి చెల్లించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు రూ. 75 కోట్లను విడుదల చేసింది. 2030 మే నెల నాటికి పదవీ విరమణ పొందే సుమారు 8,450 మంది ఉద్యోగులకు ఈ నిధులు అందనున్నాయి. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భరోసా కోసం ఉద్యోగులు తమ జీతాల నుంచి నెలనెలా పొదుపు చేసుకున్న ఈ మొత్తాన్ని వాపస్ చేసింది.

జగన్ ప్రభుత్వ హయాంలో పథకం రద్దు

వైఎస్ జగన్(YS Jagan) ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సందర్భంలో ఈ SRBS పథకాన్ని రద్దు చేసింది. అయితే ఉద్యోగులు తాము దాచుకున్న సొమ్మును తమకు తిరిగి ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని సుదీర్ఘకాలంగా వినతులు అందజేశారు. దీంతో ఉద్యోగుల విన్నపాన్ని మన్నించి నిధులను విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆర్టీసీ కార్మిక పరిషత్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు(Cm Chandrababu), మంత్రి రాంప్రసాద్ రెడ్డి(Minister Ramprasad Reddy), ఆర్టీసీ చైర్మన్, ఎండీలకు కార్మిక సంఘాల నేతలు శేషగిరిరావు, వై. శ్రీనివాస్ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story