- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేటు విద్యా సంస్థలకు బిగ్ షాక్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
పంచాయతీలకు పరిశ్రమలు, ప్రైయివేటు విద్యాసంస్థల పన్ను ఎగవేతపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆయా యాజమాన్యాల నుంచి పన్ను వసూలు చేయాల్సిందేనని నిర్ణయించింది. ..

X
దిశ, వెబ్ డెస్క్: పంచాయతీలకు పరిశ్రమలు, ప్రైయివేటు విద్యాసంస్థల పన్ను ఎగవేతపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆయా యాజమాన్యాల నుంచి పన్ను వసూలు చేయాల్సిందేనని నిర్ణయించింది. ఈ మేరకు పీఆర్,ఆర్.డి అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పంచాయతీలకు పరిశ్రమలు, ప్రైయివేటు విద్యాసంస్థల నుంచి రావాల్సిన పన్నుల బకాయిలపై ఆరా తీశారు. సామాన్యులు పన్నులు కడుతున్నప్పుడు పరిశ్రమలు, విద్యాసంస్థలు ఎందుకు చెల్లించడంలేదని ప్రశ్నించారు. పన్నుల వసూలు విషయంలో కఠినంగా ఉండాలని, అలసత్వం వద్దని అధికారులకు సూచించారు. పన్నులు వసూలు చెల్లించని పరిశ్రమలు, ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో గైడ్ లైన్స్ ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశించారు.
Next Story






