- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cigarette:ప్రాణం తీసిన సిగరెట్.. ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయాడు
సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు.. కానీ కొందరు తెలిసి కూడా సిగరెట్‌కు బానిసలు అవుతున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు.. కానీ కొందరు తెలిసి కూడా సిగరెట్‌కు బానిసలు అవుతున్నారు. సిగరెట్(Cigarette) కాల్చడం వల్ల ఒక్కరికే కాదు తమ చుట్టూ ఉన్నవారికి కూడా ప్రమాదమే. అయినా కూడా సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారు అవేవి పట్టించుకోరు. ఈ వ్యసనానికి బానిసై చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. చివరకు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే.. విధి మనుషుల జీవితాలతో ఎప్పుడు.. ఎలా ఆడుకుంటుందో చెప్పలేం. క్షణ వ్యవధిలోనే అంతా మారిపోతుంది. తాజాగా సిగరెట్ ఓ ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళితే.. గుడివాడ(Gudivada)లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధుడు తాను కాలుస్తున్న సిగరెట్ మంచానికి నిప్పంటుకుని దుర్మరణం చెందాడు.
గుడివాడలోని ద్రోణాదుల కాలనీకి చెందిన చల్లా వెంకటేశ్వరరావు (71) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు. సిగరెట్(Cigarette) వెలిగించి నిద్రలోకి జారుకున్నాడు. సిగరెట్‌కు ఉన్న నిప్పు అతను పడుకున్న మంచం ప్లాస్టిక్ నవ్వారుకు అంటుకుంది. దీంతో అగ్ని ప్రమాదం జరిగి.. తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో వెంకటేశ్వరరావుకు టిఫిన్ తీసుకువచ్చేందుకు ఆయన భార్య సావిత్రి బయటకు వెళ్లింది. తిరిగి వచ్చేసరికి మంటల్లో కాలిపోతున్న భర్తను చూసి ఒక్కసారిగా కేకలు వేసింది. ఇరుగు పొరుగు వారి సహాయంతో 108 వాహనం ద్వారా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






