- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాయుడు వీడియోపై సీఎంవో ఆరా.. ఇరకాటంలో బొజ్జల సుధీర్ రెడ్డి
జనసేన మహిళా నేత వినుత కోట డ్రైవరు రాయుడు సెల్ఫీ వీడియోపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది...

దిశ, చిత్తూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జనసేన నుంచి సస్పెన్షన్‌కు గురైన మహిళా నేత వినుత కోట డ్రైవరు శ్రీనివాసులు అలియాస్ రాయుడు సెల్ఫీ వీడియోపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది. ఈ వీడియోకు సంబంధించి వెంటనే నివేదిక ఇవ్వాలని నిఘా వర్గాలను ఆదేశించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి ఇరకాటంలో పడ్డారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన నుంచి సస్పెన్షన్‌కు గురైన వినుత కోట కారు డ్రైవరు రాయుడు ఈ ఏడాది జులై 7న హత్యకు గురయ్యారు. అదే నెల 13వ తేదీ చెన్నైలో పోలీసులు రాయుడు మృతదేహాన్ని గుర్తించి కేసు నమోదు చేశారు. వారికి దొరికిన ఆధారాలతో ఈ కేసులో వినుత కోట, ఆమె భర్త కోట చంద్రబాబుతో పాటు వారి అనుచరుల్లో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో న్యాయస్థానం వారు వినుత కోటకు బెయిల్ మంజూరు చేశారు. మిగిలిన వారు జైలులో ఉన్నారు. ఇదిలా ఉండగా హత్యకు గురి కాబడిన శ్రీనివాసులు (రాయుడు) మాట్లాడిన వీడియో ఆదివారం బయట వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ వీడియోపై నిజానిజాలు వెలికి తీయాలని ముఖ్యమంత్రి కార్యాలయం వారు నిఘా వర్గాలను ఆదేశించారు. అదేవిధంగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి నప్పటి నుంచి ఏం చేశారు...? ఆయన వ్యవహార శైలిలపై నివేదిక కోరారు. ఇక టీడీపీ పరంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కూడా బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి గురించి శ్రీకాళహస్తి నుంచి నివేదిక తెప్పించుకుంటేన్నట్లు తెలిసింది. అటు సీఎంవో... ఇటు పార్టీ రెండూ బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి వ్యవహార శైలిపై నివేదికలు కోరడంతో ఆయన ఇరకాటంలో పడ్డారు.
ఒక్కొక్కరికి ఒక న్యాయమా...?
తన డ్రైవరు రాయుడు హత్య కేసులో నిందితురాలిగా వినుత కోట అరెస్టు కావడంతో జనసేన అధిష్టానం ఆమెను వెంటనే సస్పెండ్ చేశారని... బొజ్జల వెంకట సుదీర్ రెడ్డిపై విడుదలైన రాయుడు వీడియో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని... కొందరు జనసేన కీలక నేతలు కొందరు కూటమి పెద్దల వద్ద తాజాగా ప్రస్తావించినట్లు తెలిసింది. జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ అంశంపై తీవ్రంగా చర్చిస్తున్నట్లు సమాచారం. మహిళా నేతపై హత్యకు కుట్ర పన్నిన విషయం బయట పడటంతో కూటమికి చాలా చెడ్డపేరు వస్తోందని... ఇందుకు బాధ్యులైన అందరిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలనే డిమాండు కూడా పెరుగతోంది. కాగా కొందరు నేతలు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమాలం విషయం కూడా ప్రస్తావిస్తున్నారు. ఓ మహిళ గురించి వీడియో బయట వచ్చిన వెంటనే కోనేటి ఆదిమూలం ను పార్టీ నుంచి సస్పెండు చేశారని... అయితే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. టీడీపీ అధిష్టానం, కూటమి పెద్దలు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.






