- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అగ్నిప్రమాదంపై అధికారులతో సీఎం సమీక్ష
సార్లంక అగ్నిప్రమాద బాధితులకు ప్రభుత్వ సాయం.

దిశ, వెబ్ డెస్క్ : కాకినాడ జిల్లాలోని (Kakinada) సార్లంకలో ఘోర అగ్ని్ప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ దుర్ఘటనలో 38కి పైగా తాటాకు ఇళ్లు మంటల్లో కాలిపోయాయి. ఈ దురదృష్టకర ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పండుగపూట ఇటువంటి బాధాకరమైన ఘటన బాధిత కుటుంబాల్లో పెను విషాదం నింపిందన్నారు. బాధితుల పక్షాన నిలుస్తూ కాకినాడ జిల్లా సార్లంకలో (Sarlanka) జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు జరుగుతున్న వేళ ఇటువంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. బాధితులకు అన్ని విధాల సహాయం చేయాలని మంత్రులు, అధికారులను సీఎం ఆదేశించారు. వారు ఇబ్బంది పడకుండా వసతి, ఆహారం అందించాలని సూచించారు. బాధితులకు కొత్త ఇళ్లు మంజూరు చేయాలని తెలిపారు. హోంమంత్రి, అధికారులు మాట్లాడుతూ సార్లంక అగ్నిప్రమాద బాధితులకు అందిస్తున్న సహాయం గురించి సీఎంకు వివరించారు. తక్షణ సాయం కింద ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25వేలు అందిస్తున్నామని తెలియజేశారు. అవసరమైన సహాయాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నామని వెల్లడించారు.






