- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుపతి IITకి కేంద్రం తీపి కబురు.. రూ.2,313 కోట్ల నిధులు విడుదల
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తిరుపతి IIT విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం విదితమే.

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తిరుపతి IIT విస్తరణకు ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఇవాళ తిరుపతి ఐఐటీకి రూ.2,313 కోట్ల నిధులు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ (KN Satyanarayana) మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో ఐఐటీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. 2015లో కేంద్ర ప్రభుత్వం తిరుపతి (Tirupati)కి ఐఐటీని మంజూరు చేసిందని, 2017 నుంచి 2024 వరకు సుమారు రూ1,100 కోట్ల నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. 2017 నుంచి ఏర్పేడు (Erpedu) వద్ద ఐఐటీ ప్రాంగణంలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని.. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం సంతోషకరమని తెలిపారు. సుమారు 12 వేల మంది విద్యార్థులకు వసతితో పాటు, విద్యా బోధనకు ఆ నిధులు ఎంతగానో దోహదపడనున్నాయి.






