గుంటూరు వాసులకు గుడ్ న్యూస్...రూ.98 కోట్లు మంజూరు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-03 09:14:12  IST  )

గుంటూరు వాసులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది..

గుంటూరు వాసులకు గుడ్ న్యూస్...రూ.98 కోట్లు మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు(Guntur) వాసులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. నగరంలో సరైన ఓవర్ బ్రిడ్జి(Overbridge) లేక ఇబ్బందులు ప్రజలను దృష్టిలో ఉంచుకుని భారీగా నిధులు విడుదల చేసింది.అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గుంటూరు శంకర్ విలాస్ వద్ద ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిప్రాదనలను కేంద్రానికి నివేదించారు. దీంతో వెంటనే స్పందించిన కేంద్రప్రభుత్వం(Central Government) గుంటూరు ఓవర్ బ్రిడ్జి కోసం రూ. 98 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. శంకుస్థాపన స్థలాన్ని నగరపాలక సంస్థ అధికారులు పరిశీలించారు. ఈ నెల 7న గుంటూరుకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. శంకర్ విలాస్ వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

Next Story