ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక ఏర్పాట్లు షురూ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-11 15:05:09  IST  )

ఆక్వా రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ...

ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక ఏర్పాట్లు షురూ
X

దిశ, వెబ్ డెస్క్: ఆక్వా రైతుల(Aqua farmers)కు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. అమెరికా(America) ట్యాక్స్‌లతో కుదేలైన ఆక్వారైతులకు ఉపశమనం కలిగిస్తూ కీలక ప్రకటన చేసింది. అమెరికా టారిఫ్‌ల నుంచి ఆక్వా రైతులకు వెసులుబాటు కల్పించేందుకు నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపింది. అంతేకాదు అండగా ఉంటామని భరోసా సైతం కల్పిస్తోంది. అలాగే ఆక్వా రైతులకు ప్రత్యేక శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు(Union Minister Bhupathi Raju Srinivasa Varma) దృవీకరించారు.


ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ ‘‘అమెరికా ట్యాక్స్‌లతో ఆక్వా పరిశ్రమ కుదేలైంది. అమెరికా టారిఫ్‌ల నుంచి ఆక్వా రైతులకు వెసులుబాటు కల్పించాలని మోదీ యోచిస్తున్నారు. ఆక్వా రైతులకు కేంద్రం అండగా ఉంటుంది. ప్రధాని మోదీ ఆక్వాకు ప్రత్యేక శాఖ కేటాయించారు.’’ అని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు.

Next Story